Thursday, October 6, 2022
సర్దార్ సరోవర్ డ్యామ్
GENERAL KNOWLEDGE
అతి పెద్ద మంచినీటి సరస్సు -- బైకాల్ సరస్సు
* ఈ బైకాల్ సరస్సు రష్యాలోని తూర్పు సైబీరియా ప్రాంతం లో ఉంది. చంద్రవంక ఆకారంలో ఉండే ఈ అందమైన సరస్సును పర్ల్ ఆఫ్ రష్యా అని పిలుస్తారు.
* లేక్ బైకాల్ అతిపెద్ద మంచి నీటి సరసుల్లో ఒకటి. ఎత్తయిన పర్వతాలు, కొండల మధ్య ఇంచుమించు 636 కిలోమీటర్ల పొడవు, 20 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ప్రపంచంలో లోతైన సరస్సు ఇదే. దాదాపు 5,387 అడుగుల లోతు ఉంటుంది. అంతేకాదూ.. ప్రపంచంలో గడ్డ కట్టని మంచినీటిలో 20 శాతం నీరు ఈ సరస్సులోనే ఉంటుంది.
* ఉపరితల వైశాల్యం ప్రకారం ఇది ఏడవ అతిపెద్ద సరస్సు.
* బైకాల్ సరస్సు భూమి ఉపరితలంపై మంచినీటి సరస్సులో ఐదవ వంతు ఉంటుంది
* ఈ సరస్సు తీర ప్రాంతం పొడవు 2,100 కిలోమీటర్లు.
* బైకాల్ సరస్సులో ఇంచుమించు 30 దీవులు వరకూ ఉంటాయి. వీటిల్లో ఒకటి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరస్సు దీవి. ఈ సరస్సులోని ఒల్కహాన్ అనే దీవిలో ఊళ్లు కూడా ఉంటాయి. అందులో 1500 జనాభా ఉంటుంది.
* పురాతనమైన సరస్సుల్లో ఇదీ ఉంది. ఎప్పుడో ఇంచుమించు 25 మిలియన్ ఏళ్ల క్రితమే ఏర్పడిందట. ఎత్తయిన నేలల మధ్యనో, పర్వత శ్రేణుల మధ్యనో భౌగోళిక మార్పుల ఫలితంగా లోతైన ప్రదేశం ఏర్పడినప్పుడు దాన్ని ‘రిఫ్ట్ వ్యాలీ’ అంటారు. ఈ రకంగానే ప్రాచీన కాలంలోనే ఈ బైకాల్ సరస్సు ఏర్పడింది.
టాంగన్యికా సరస్సు
- టాంగన్యికా సరస్సు ప్రపంచంలోనే అతి పొడవైన మంచినీటి సరస్సు.
- టాంగన్యికా సరస్సు ప్రపంచంలో రెండవ లోతైన సరస్సు.
- టాంగన్యికా సరస్సు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు.
- ఇది మధ్య ఆఫ్రికాలో టాంజానియా, ప్రజాస్వామ్య గణతంత్ర కాంగో, జాంబియా మరియు బురుండి సరిహద్దులలో ఉంది.
సుపీరియర్ సరస్సు
- సుపీరియర్ సరస్సు ఉపరితల వైశాల్యంలో అతిపెద్ద మంచినీటి సరస్సు.
- సరస్సు సుపీరియర్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మంచినీటి సరస్సు.
- ఇది ఉత్తర అమెరికాలోని ఐదు గొప్ప సరస్సులలో అతిపెద్దది.
- ఇది ఉత్తరాన అంటారియో, పశ్చిమాన మిన్నెసోటా, మరియు విస్కాన్సిన్ మరియు మిచిగాన్ ఎగువ ద్వీపకల్పం దక్షిణాన పంచుకుంటాయి.
వోస్టోక్ సరస్సు
- వోస్టోక్ సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద ఉప హిమనదీయ సరస్సులలో ఒకటి.
- ఇది తూర్పు అంటార్కిటికాలో ఉంది.
Sunday, October 2, 2022
మొక్కలు -- శాస్త్రీయ నామాలు
మొక్క సాధారణ నామం | శాస్త్రీయ నామం | |
» మామిడి | - | మాంజిఫెరా ఇండికా |
» కొబ్బరి | - | కోకస్ న్యూసిఫెరా |
» మందార | - | హైబిస్కస్ రోజా సైనెన్సిస్ |
» గోంగూర | - | హైబిస్కస్ కన్నాబినస్ |
» బెండ | - | హైబిస్కస్ ఎస్కులేంటస్ |
» చింత | - | టామరిండస్ ఇండికా |
» మల్లె | - | జాస్మినం ఇండికం |
» ఆపిల్ | - | ఫైరస్ మాలస్ |
» పైనాపిల్ | - | అనానాస్ సెటైవా |
» బొప్పాయి | - | కారియా పపాయా |
» వంగ | - | సొలానం మెలాంజినమ్ |
» బంగాళాదుంప | - | సొలానం ట్యూబరోసమ్ |
» ఉల్లి | - | ఎల్లియం సెపా |
» వెల్లుల్లి | - | ఎల్లియం సెటైవమ్ |
» తామర | - | నీలంబో న్యూసిఫెరా |
» చామంతి | - | క్రైసాంథియమ్ ఇండికా |
» బంతి | - | టాజినెస్ పాట్యులా |
» తులసి | - | ఆసిమం సాంక్టం |
» ముల్లంగి | - | రఫానస్ సెటైవమ్ |
» ఉసిరి | - | ఎంబ్లికా అఫిషినాలిస్ |
» పత్తి | - | గాసీపియం హెర్బీషియం |
» పొగాకు | - | నికోటియానా టొబాకమ్ |
» జామ | - | సిడియం గువా |
» దానిమ్మ | - | ప్యూనికా గ్రనాటమ్ |
» ద్రాక్ష | - | వైటిస్ వినిఫెరా |
» అరటి | - | మ్యూస పారడైసిక |
» సీతాఫలం | - | అనోనా స్క్వామోజా |
» పనస | - | ఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా |
» జీడిమామిడి | - | అనకార్డియం ఆక్సిడెంటేలిస్ |
» వేప | - | అజాడిరక్టా ఇండికా |
» ఆవాలు | - | బ్రాసికా నైగ్రా |
» క్యాబేజీ | - | బ్రాసికా ఒలరేషియా రకం కాపిటేటు |
» కాలిఫ్లవర్ | - | బ్రాసికా ఒలరేషియా రకం బోట్రిటస్ |
» చిక్కుడు | - | డాలికస్ లాబ్ లాబ్ |
» వేరుశనగ | - | అరాఖిస్ హైపోజియం |
» శనగ | - | సైసర్ అరాటినం |
» బఠాణి | - | పైసమ్ సెటైవం |
» టమాట | - | లైకోపెర్సికం ఎస్కులెంటమ్ |
» మిర్చి | - | కాప్సికం ప్రూటెన్సిస్ |
» జొన్న | - | సోర్గం వల్గేర్ |
» గోధుమ | - | ట్రిటికం ఈస్టివం |
» వరి | - | ఒరైజా సటైవా |
» సజ్జ | - | పెన్నిసేటం టైపాయిడం |
» రాగులు | - | ఇల్యుసైన్ కొరకానా |
» పెసర | - | పేసియోలస్ అరియస్ |
» మినుము | - | పేసియోలస్ ముంగో |
» కంది | - | కజానస్ కజాన్ |
» సోయాబీన్ | - | గ్లైసిన్ మాక్స్ |
» నువ్వులు | - | సిసామమ్ ఇండికం |
» మొక్కజొన్న | - | జియామేజ్ |
» పామ్ | - | ఇల్యుసిస్ గైనన్సిస్ |
» ఆముదం | - | రిసినస్ కమ్యూనస్ |
» జనుము | - | క్రోటలేరియా జెన్షియా |
» మిరియాలు | - | పైపర్ నైగ్రం |
» లవంగం | - | యాజీనియా కారియోఫిల్లెటా |
» జీలకర్ర | - | కుకుమినమ్ సిమినమ్ |
» సోంపు | - | పోనీక్యులమ్ వల్గేర్ |
» దాల్చిన చెక్క | - | సిన్నమోమమ్ జైలానిక |
» మెంతి | - | ట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్ |
» టేకు | - | టెక్టోనా గ్రాండిస్ |
» ఎర్ర చందనం | - | టీరోకార్పస్ సాంటలైనస్ |
» వెదురు | - | బాంబూసా |
» అశ్వగంథి | - | విథానియా సోమ్నిఫెరా |
» తేయాకు | - | ధియోసైనెన్సిస్ |
» కాఫీ | - | కాఫియా అరబిక |
» కోకో | - | థియోబ్రోమా కాకోస్ |
» బార్లి | - | హార్డియం వల్లారే |
» చెరకు | - | శాఖారమ్ అఫిసినెరం |
» తమలపాకు | - | హైపల్ బీటిల్ |
» కొకొ | - | ఎరిత్రోజైలాన్ కొకొ |
» సుపారి | - | అరికాకటెచు |
» కోలా | - | కోలా నైటిడా |
» ఓపియం (మార్ఫిన్) | - | పెసావర్ సోమ్నిఫెరం |
» గంజాయి (హెరాయిన్) | - | కన్నాబినస్ సటైవం |
» సర్పగ్రంథి | - | రావుల్ఫియా సర్పెంటైనా |
» బిళ్ల గన్నేరు | - | వింకారోజియస్ |
» ప్రొద్దు తిరుగుడు | - | హీలియాంథస్ ఎన్యూవస్ |