ఈ డ్యామ్‌కు 1961లో జవహర్‌లాల్ నెహ్రూ పునాది వేశారు. 1979లో నిర్మాణ పనులు ప్రారంభించారు.
సర్దార్ సరోవర్ డ్యామ్నర్మదా నదిపై 2017లో నిర్మించబడింది.
భారతదేశంలోని అతిపెద్ద నీటి వనరుల ప్రాజెక్టులలో ఒకటైన సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలను అనుసంధానం చేస్తుంది.
ప్రపంచంలోనే మూడవ అత్యధిక సామర్థ్యం గల ఈ డ్యామ్ స్పిల్‌వే డిశ్చార్జింగ్ సామర్థ్యం 30.7 లక్షల క్యూసెక్కులు.
నర్మద ప్రధాన కాలువ ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల కాలువ.
ఇది భారతదేశంలో మూడవఅతిపెద్ద కాంక్రీట్ డ్యామ్ (163 మీటర్లు), మొదటిది హిమాచల్ ప్రదేశ్‌లోని భాక్రా (226 మీటర్లు), రెండవది ఉత్తరప్రదేశ్‌లోని లఖ్వార్ (192 మీటర్లు).
ఇది గ్రావిటీ డ్యామ్‌లలో ప్రపంచంలోనే రెండవ-అతిపెద్ద ఆనకట్ట. మొదటిది USAలోని గ్రాండ్ కౌలీ డ్యామ్.
No comments:
Post a Comment