Monday, September 19, 2022
తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది?
Confusion Points
- అంతకుముందు, ఇది మహేంద్ర గిరి కొండ, తూర్పు ఘాట్‌లో ఎత్తైన శిఖరంగా కిరీటాన్ని కలిగి ఉంది, అయితే ఏప్రిల్ 2011లో, వై.వెంకట్ రెడ్డి నేతృత్వంలోని బృందం మహేంద్ర గిరి కొండ కేవలం 1,501 మీటర్ల ఎత్తులో ఉందని కనుగొన్నారు.
Additional Information
- తూర్పు కనుమలు ప్రధానంగా 4 రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులను కవర్ చేస్తాయి.
- తూర్పు కనుమల పొడవు కిలోమీటరులో దాదాపు 430 కిలోమీటర్లు.
- మహేంద్రగిరి
- ఇది ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాకిమిడిలో ఉంది.
- ఇది 1,501 మీటర్ల ఎత్తులో ఉంది.
- ఇది కొరాపుట్‌లోని డియోమాలి తర్వాత ఒడిశాలోని రెండవ ఎత్తైన పర్వత శిఖరం. ,
- నీలగిరి
- తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న పర్వత శ్రేణికి నీలగిరి అని పేరు.
- నీలగిరి కొండలు పశ్చిమ కనుమలు అని పిలువబడే పెద్ద పర్వత శ్రేణిలో భాగం.
- పరిపాలనా ప్రధాన కార్యాలయం ఊటీలో ఉంది.
- నీలగిరిలో ఎత్తైన ప్రదేశం మరియు శ్రేణి యొక్క దక్షిణ పరిధి దొడ్డబెట్ట శిఖరం (8,652 అడుగులు)
- ఆనైముడి
- అనముడి భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లా మరియు ఇడుక్కి జిల్లాలో ఉన్న ఒక పర్వతం.
- ఇది అన్నామలై కొండలలో ఒక భాగం.
- ఇది పశ్చిమ కనుమలలో మరియు దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం (8,842 అడుగులు).
దేశంలో తీర రేఖ కలిగిన రాష్ట్రాలు వాటి వివరాలు
భారతదేశ తీరరేఖ పొడవు - 7516.7 కి.మీ.తీర రేఖ పరంగా భారతదేశ స్థానం(ప్రపంచంలో) - 18. భారతదేశంలో తీర రేఖ గల రాష్ట్రాలు - 9, కేంద్ర పాలిత ప్రాంతాలు-4. తీర రేఖ కలిగిన రాజకీయ విభాగాలు: 13
తీర రేఖ కలిగిన రాష్ట్రాలు:
పశ్చిమ తీరం
గుజరాత్(1214.7 కి.మీ.).
· గుజరాత్ తీరాన్ని ‘కతీయవార్ తీరం’ అని పిలుస్తారు. దేశంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్.
మహారాష్ట్ర(652.6 కి.మీ.)
· మహారాష్ట్ర తీరాన్ని ‘కొంకణ్ తీరం’ అని పిలుస్తారు
గోవా(101 కి.మీ.)
· గోవా తీరాన్ని ‘కొంకణ్ తీరం’ అని పిలుస్తారు. అతి తక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రం గోవా.
కర్ణాటక(280 కి.మీ.)
· కర్ణాటక తీరాన్ని ‘కెనరా తీరం’ అని పిలుస్తారు
కేరళ(569.7 కి.మీ.)
· కేరళ తీరాన్ని ‘మలబార్ తీరం’ అని పిలుస్తారు
·
తూర్పు తీరం
తమిళనాడు(906.9 కి.మీ.)
· తమిళనాడు తీరాన్ని ‘కోరమాండల్ తీరం’ అని పిలుస్తారు
ఆంధ్రప్రదేశ్(974 కి.మీ.)
· ఆంధ్రా తీరాన్ని ‘సర్కార్ తీరం’ అని పిలుస్తారు. దేశంలో రెండో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం. తూర్పు తీరంలో అత్యధిక తీర రేఖ కలిగిన రాష్ట్రం.
ఒడిసా(476.4 కి.మీ.)
· ఒడిసా తీరాన్ని ‘ఉత్కళ తీరం’ అని పిలుస్తారు
పశ్చిమ బెంగాల్(157.5 కి.మీ.)
· దీని తీరాన్ని ‘వంగ తీరం’ అని పిలుస్తారు.
·
కేంద్రపాలిత ప్రాంతాలు:
1. అండమాన్ నికోబార్ - 1962 కి.మీ.
2. లక్ష దీవులు - 132 కి.మీ.
3. పుదుచ్చేరి - 47.6 కి.మీ.
4. డయ్యూడామన్ - 42.5 కి.మీ.
· దేశంలో అత్యధిక తీర రేఖ కలిగిన రాష్ర్టాలు : 1. గుజరాత్, 2. ఆంధ్రప్రదేశ్
· దేశంలో అతి తక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రాలు: 1. గోవా, 2. పశ్చిమ బెంగాల్
· దేశంలో అతిపొడవైన తీరం: కథియావార్ తీరం
· దేశంలో అతి తక్కువ పొడవు కలిగిన తీరం: వంగ తీరం
· దేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం: అండమాన్ నికోబార్
· దేశంలో అతి తక్కువ తీర రేఖ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం: డామన్ డయ్యూ
· ప్రపంచంలో అత్యధిక తీరరేఖ కలిగిన దేశం: కెనడా - 2, 02,080 కి.మీ.
· ప్రపంచంలో అత్యల్ప తీరరేఖ కలిగిన దేశం: మొనాకో - 4.1 కి.మీ.
· ప్రపంచంలో అత్యధిక తీరరేఖ కలిగిన నగరం: కోక్సస్ బజార్(బంగ్లాదేశ్)
· దేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన నగరం: చెన్నై
· ప్రపంచంలో అతిపొడవైన బీచ్: ప్రయ డో కాసినో(బ్రెజిల్)- 254. కి.మీ.
· దేశంలో అతి పొడవైన బీచ్: మెరీనా బీచ్ - 13 కి.మీ.
· దేశంలో అత్యధిక బీచ్లను కలిగిన రాష్ట్రం: మహారాష్ట్ర'
·
బ్లూఫ్లాగ్ బీచ్లు
ఈ సర్టిఫికెట్ని పొందాలంటే బీచ్ పర్యావరణహితంగా ఉండటంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి రసాయనాలు బీచ్ పరిసరాల్లో కలవకుండా చూడాలి. ఈ సర్టిఫికెట్ని డెన్మార్క్కి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్(ఎ్ఫఈఈ) ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్లాగ్ బీచ్‌లకు విశేషాదరణ ఉంటుంది. విదేశీ పర్యాటకులు ముందుగా బ్లూఫ్లాగ్ బీచ్‌నే ఎంపిక చేసుకుంటారు. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ని పొందాయి. 2020 అక్టోబరు 11న మనదేశంలో 10 బీచ్లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయని ఎఫ్ఈఈ వెల్లడించింది. అవి..
1. రుషికొండ బీచ్(ఆంధ్రప్రదేశ్)
2. గోల్డెన్ బీచ్(ఒడిషా)
3. రాధానగర్ బీచ్(అండమాన్)
4. కోవెలం బీచ్(తమిళనాడు)
5. ఈడెన్ బీచ్(పుదుచ్చేరి)
6. కప్పడ్ బీచ్(కేరళ)
7. పదుబిద్రి బీచ్(కర్ణాటక)
8. కాసర్గోడ్ బీచ్(కర్ణాటక)
9. ఘోగ్లా బీచ్(డయ్యూ)
10. శివరాజ్‌పూర్ బీచ్(గుజరాత్)
· భారతదేశ ప్రాదేశిక జలాల పరిధి 12 నాటికల్ మైళ్లు(ఒక నాటికల్ మైలు = 1.852 కి.మీ.).
· ఈ పరిధిలోకి ప్రవేశించాలంటే ఏ విదేశీ నౌకకైనా భారత్ అనుమతి తప్పనిసరి.
ప్రత్యేక ఆర్థిక మండలి
· వ్యాపారపరంగా భారత జలాల పరిధి 200 నాటికల్ మైళ్లు(370 కి.మీ.)
· ఈ ప్రాంతంలో దొరికే వనరులు అన్నీ భారత్కే చెందుతాయి. ఉదా: బాంబే హై
· ఈ జలాల పరిధి మొత్తం విస్తీర్ణం పరంగా - 2.02 మిలియన్ చ.కి.మీ.
·
1. భారత్ - శ్రీలంక
· భారతదేశం, శ్రీలంక మధ్య ఆడమ్స్ బ్రిడ్జ్/రామసేతు, పాంబాన్ దీవి, పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ ప్రాంతాలు ఉన్నాయి.
ఆడమ్స్ బ్రిడ్జ్: తమిళనాడుకు దక్షిణాన పాంబాన్ దీవిలోని ‘ధనుష్ కోటి’ నుంచి శ్రీలంకలోని ‘తలైమన్నార్’ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీని పొడవు 48. కి.మీ.
పాంబాన్ దీవి: ఇది భారత్, శ్రీలంకకు మధ్య గల ‘శిలా ఉపరితలం’ గల దీవి
పాక్ జలసంధి: ఆడమ్స్ బ్రిడ్జ్‌కు ఉత్తరాన పాక్ అఖాతం, పాక్ జలసంధి ఉన్నాయి. ఈ పాక్ జలసంధి భారత్లోని ‘పాయింట్ కోడిక్కిరామ్’ నుంచి శ్రీలంకలోని ‘పీడ్ మౌంట్’ వరకు ఉంటుంది.
మన్నార్ సింధు శాఖ: ఆడమ్స్ బ్రిడ్జ్‌కి దక్షిణాన మన్నార్ సింధు శాఖ ఉంది. ఈ సింధు శాఖ భారత్లోని ‘నాగర్ కోయిల్(తమిళనాడు)’ నుంచి శ్రీలంకలోని ‘మన్నార్’ వరకు విస్తరించి ఉంది.
· 1974లో జరిగిన ఒప్పందం ప్రకారం ‘కచ్చతీవు’ దీవిని భారత్ శ్రీలంకకు లీజుకు ఇచ్చింది.
· 1956లో శ్రీలంక ‘సింహాలిస్ ఓన్లీ’ అనే చట్టం చేయడంతో, దానికి వ్యతిరేకంగా శ్రీలంక తమిళులు ఉద్యమం ప్రారంభించారు.
· 1976లో ఎల్టీటీఈ(లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం) ఏర్పడింది.
· 1987లో ఐపీకేఎ్ఫ(ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్) ఏర్పడింది. శ్రీలంకలో శాంతి స్థాపన కోసం భారతదేశం ఎల్టీటీఈకి వ్యతిరేకంగా దీనిని ఏర్పాటు చేసింది.
· 1991 మే 21న తమిళనాడులోని పెరంబూరులో ఎల్టీటీఈ ఆత్మాహుతి దళం రాజీవ్ గాంధీని హత్య చేసింది.
· మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
· శ్రీలంకలోని తమిళులు ఉన్న ఉత్తర భాగాన్ని ‘జాఫ్నా’ అని పిలుస్తారు.
· ఎల్టీటీఈ 2019 మే 18న అంతమైంది
2. భారత్ - మాల్దీవులు: భారత్కు, మాల్దీవులకు మధ్య 8 డిగ్రీ చానల్ ఉంది.
3. భారత్ - ఇండోనేషియా: భారత్లోని గ్రేట్ నికోబార్ దీవికి, ఇండోనేషియాలోని సుమత్రా దీవికి మధ్య గ్రేట్ చానల్ ఉంది.
4. భారత్ - థాయ్లాండ్: భారతదేశానికి, థాయ్లాండ్కు మధ్య అండమాన్ సముద్రం ఉంది.
5. భారత్ - మయన్మార్: భారత్కు, మయన్మార్కు మధ్య కోకో చానల్ ఉంది.
6. భారత్ - బంగ్లాదేశ్: భారత్కు, బంగ్లాదేశ్కు మధ్య గల వివాదాస్పద దీవి - న్యూమర్ దీవి. ఇది 1970 ప్రాంతంలో ఏర్పడిన సైక్లోన్ సమయంలో ఏర్పడింది. ఇది నివాసరహిత ప్రాంతం అయినా ఇక్కడ పెద్ద ఎత్తున చమురు నిక్షేపాలు లభించే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో రెండు దేశాలు దీనిపై హక్కుల కోసం ప్రయత్నించాయి. ఈ వివాదంపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2014లో అంతర్జాతీయ న్యాయస్థానం న్యూమర్ దీవిని ఇరుదేశాలకు పంచింది.